: మన దేశం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు...!
ప్రపంచ దేశాల్లో భారత్ ది ఓ ప్రత్యేక స్థానం. ఎన్నో రకాల విశిష్ట లక్షణాలతో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం గొప్పగా కనిపిస్తుంటుంది. ఇండియా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. * ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడేది ఇండియాలోనే. * ప్రపంచ దేశాల రాజ్యాంగాల్లోకెల్లా భారత రాజ్యాంగమే అతి పెద్దది. * శాకాహారులు అత్యధికంగా భారత్ లోనే ఉన్నారు. * మన దేశంలో ఉన్న మొత్తం రోడ్లను కలిపితే... ప్రపంచాన్ని 117 సార్లు చుట్టేయవచ్చు * 90 దేశాలకు భారత్ నుంచి ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. * చంద్రుడిపై నీటి ఆనవాళ్లను తొలిసారి కనిపెట్టింది మన చంద్రయాన్-1. * అధికారికంగా భారత్ కు జాతీయ క్రీడ లేదు. అలాగే జాతీయ భాష కూడా లేదు. హిందీ, ఇంగ్లీష్ లను అధికార భాషలుగా మాత్రమే గుర్తిస్తున్నారు. * గత 1000 సంవత్సరాల నుంచి భారత్ మరే ఇతర దేశాన్ని ఆక్రమించడం కాని, దాడి చేయడం కానీ చేయలేదు. * ప్రపంచంలో అత్యధిక సినిమాలను ఇండియాలోనే నిర్మిస్తున్నారు. * ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నగరం కాశీ. * ప్రపంచంలో 25 శాతం జనాభాను కలిగిన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు భారత్ లోనే పుట్టాయి. * 6వేల ఏళ్ల క్రితమే భారతీయులు నేవిగేషన్ సిస్టమ్ ను ఉపయోగించారు. * షాంపూను తొలుత వాడింది భారతీయులే.