: తెలంగాణలో అతిపెద్ద స్టోర్ ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్
తెలంగాణ రాష్ట్రంలో ఈ-కామర్స్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ అతిపెద్ద స్టోర్ ను ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి గ్రామంలో ఆ స్టోర్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ బ్రాంచ్ తో దేశ వ్యాప్తంగా ఫ్లిప్ కార్ట్ స్టోర్ ల సంఖ్య 17కు చేరింది. 2.2 లక్షల చదరపు అడుగుల వెడల్పులో 5.89 లక్షల క్యూబిక్ అడుగుల సామర్థ్యంతో స్టోర్ ను ఏర్పాటు చేశారు. ఈ-కామర్స్ ను విస్తరింపజేయడానికి తెలంగాణ అనువైన ప్రాంతమని ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ అన్నారు. అందుకే తాము కొత్త బ్రాంచ్ ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించామని తెలిపారు. ఈ బ్రాంచ్ ద్వారా ప్రత్యక్షంగా నైతేనేమి, పరోక్షంగా నైతేనేమి మొత్తం 17వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.