: వయసుతో బాటు ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతోందట!


వయస్సు పైబడుతున్న వారు యవ్వనంగా కనిపించాలని కోరుకోవడం సహజం. దానికి తగ్గట్లుగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, మొదలైన పద్ధతులు పాటిస్తుంటారు. కొంతమంది కాస్మొటిక్ సర్జరీ లు చేయించుకుంటారు. అయితే, 'ఫేస్ లిఫ్ట్' అనే కాస్మొటిక్ సర్జరీ చేయించుకోవడం ద్వారా అసలు వయస్సు కంటే 10 సంవత్సరాలు తక్కువగా కనిపిస్తారని చెబుతుంటారు. అయితే, అసలు వయస్సు కంటే చిన్న వయస్సు వారిలా కనపడితే కనపడవచ్చేమో కానీ, వారి ఆత్మవిశ్వాసం మాత్రం మెరుగుపడటం లేదన్న విషయం తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఆండ్రూ జుకానో ఫేసియల్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్వేలో భాగంగా ఫేస్ లిఫ్ట్ సర్జరీ చేయించుకున్న పలువురి అభిప్రాయాలను సేకరించారు. తాము తక్కువ వయస్సున్నట్లు కనపడుతున్న మాట వాస్తవమే కానీ, ఆ వయస్సు వారిలో ఉండే ఆత్వవిశ్వాసాన్ని మాత్రం తాము కనపర్చలేకపోతున్నామన్నారు.

  • Loading...

More Telugu News