: హర్భజన్ పెళ్లి వేడుకలో దాడి చేసిన బౌన్సర్ల అరెస్టు


క్రికెటర్ హర్భజన్ సింగ్ పెళ్లి జరుగుతుండగా కెమెరామెన్ లపై దాడి చేసిన ఘటనలో నలుగురు బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. జలంధర్ లోని ఫంగార్వాలోని గురుద్వారాలో నిన్న(గురువారం) భజ్జీ-గీతాబస్రా వివాహం జరిగింది. ఆ సమయంలో పెళ్లి వేడుకను చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న కెమెరామెన్ లపై బౌన్సర్లు దాడి చేశారు. దాంతో భజ్జీ ఇంటి ముందు కెమెరామెన్లు ధర్నా చేశారు. ఘటన గురించి తెలుసుకున్న హర్భజన్ వెంటనే వారికి క్షమాపణలు చెప్పారు. తరువాత బౌన్సర్లపై కెమెరామెన్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News