: 40 వేల అస్థిపంజరాల చర్చ్... విశేషంగా ఆకట్టుకునే టూరిస్ట్ స్పాట్!


ఆ చర్చ్ కి వెళ్లగానే ఎవరైనా సరే ముందుగా భయపడతారు. తర్వాత ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, పుర్రెలు, అస్థికలకు నిలయం ఆ చర్చ్! సుమారు 40 వేల మానవ అస్థిపంజరాలతో అలంకరించిన ఆ చర్చ్ టూరిస్ట్ స్పాట్ గా వెలుగొందుతోంది. చెక్ రిపబ్లిక్ రాజధాని పరాగ్వేకు సమీపంలో ఉన్న సెడ్లాక్ ఊర్లో ఈ చర్చ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 1278లో సెడ్లాక్ కు చెందిన ఓ వ్యక్తి జెరూసలెంకు వెళ్లాడు. సనాతన క్రైస్తవులు జెరూసలెంను పవిత్రంగా భావిస్తారు. దీంతో ఆ వ్యక్తి జెరూసలెం నుంచి తీసుకొచ్చిన మట్టిని ఆ ప్రాంతంలో చల్లి ఆ ప్రాంతం పవిత్రమైనదిగా ప్రకటించాడు. దీంతో ఆ పరిసరాల్లో ఎవరైనా మరణిస్తే వారిని ఆ పవిత్ర ప్రాంతంలో ఖననం చేసేవారు. ఈ సంప్రదాయం 14వ శతాబ్దం వరకు సాగింది. ఈ క్రమంలో యూరోప్ లో ప్లేగు వ్యాధి ప్రబలింది. ప్లేగు ధాటికి బలైన 30 వేల మందిని కూడా ఆ ప్రాంతంలోనే ఖననం చేశారు. అనంతర పరిణామాల్లో సెడ్లాక్ లో చోటుచేసుకున్న యుద్ధాల కారణంగా బలైన మరో 10 వేల మందిని కూడా అదే ప్రాంతంలో పాతిపెట్టారు. ఇలా భారీ ఎత్తున అక్కడ శవాలు చేరాయి. 15 శతాబ్దంలో ఆ ప్రాంతంలో చర్చ్ నిర్మించేందుకు తవ్వకాలు ప్రారంభించారు. 1870 వరకు అక్కడి అస్థిపంజరాలను ఎవరూ ముట్టుకోలేదు. అనంతరం స్థానిక శిల్పి ఆ మానవ పుర్రెలు, అస్థికలతో అద్భుతాలు సృష్టించాడు. అద్భుత కళాఖండాలు రూపొందించాడు. వాటిని చర్చ్ లో అలంకరించారు. పుర్రెల దండలు, వెన్నుపూసలతో రూపొందించిన షాండ్లీయర్ చర్చ్ కే ప్రధాన ఆకర్షణ అయ్యాయి. ఆ చర్చ్ ను చూసేందుకు పర్యాటకులు అమితాసక్తిని చూపుతున్నారు.

  • Loading...

More Telugu News