: నాలుగో వంతు పురుషుల గురించిన పచ్చినిజం!


అవును, మన దేశంలో 25 శాతం మంది పురుషులు ఏదో ఒక దశలో చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డారట. ఈ నమ్మలేని పచ్చినిజం సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆఫ్ ఉమన్, మరో రెండు ఎన్జీవోలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఏపీలోని విజయవాడ నగరంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కుల్లో 2000 మందిని భాగం చేస్తూ ఈ సర్వే జరిగింది. ఇందులో పాల్గొన్న వారు, గతంలో తాము జరిపిన లైంగిక వేధింపుల గురించి వివరించారు. ఏదో ఒక సమయంలో చిన్నారులను, యువతులను లైంగిక వేధింపులకు గురి చేశామని సర్వేలో పాల్గొన్న 24.5 శాతం మంది అంగీకరించారు. అయితే, చిన్నతనంలో నిరాదరణకు గురైన వారు, లైంగిక అత్యాచారానికి గురైన వారే, ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది పురుషులు ఏదో ఒక దశలో భౌతికంగా, లైంగికంగా మహిళలను వేధించామని ఒప్పుకున్నారు. కాగా, మహిళలపై అత్యధిక అత్యాచారాలు జరుగుతాయని చెప్పుకునే రువాండా, మెక్సికో గణాంకాల కన్నా ఇవి ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇండియాలో నిత్యమూ 90 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డులు వెల్లడిస్తున్న వేళ, ఈ రిపోర్టు విడుదల కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News