: నా ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే కొనసాగుతా: కూన వెంకటేష్ గౌడ్
తన ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటానని సనత్ నగర్ టీడీపీ ఇన్ చార్జ్ కూన వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బేగంపేటలో ఇవాళ టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీకి ద్రోహం చేసిన వారికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. పార్టీ మారని వారిని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని, వారి బెదిరింపులకు తాము లొంగబోమని ఆయన పేర్కొన్నారు.