: లంచం తీసుకుంటూ దొరికిపోయిన తహశీల్దార్
చిత్తూరు జిల్లా పీలేరు తహశీల్దార్ సురేశ్ బాబు ఏసీబీ వలలో పడ్డారు. పాసు పుస్తకం మంజూరు విషయంలో ఒక రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులకు తగిన సమాచారం అందడంతో తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.