: ఢిల్లీ హైకోర్టులో ఆప్ కు ఎదురుదెబ్బ
ఢిల్లీ హైకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సేవలను ప్రైవేట్ విద్యుత్ సరఫరా కంపెనీల ఆడిటింగ్ కు వినియోగించుకుంటామని హైకోర్టులో ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన హైకోర్టు పిటిషన్ ను కొట్టి వేసింది. ఇలాంటి విషయాలకు కాగ్ ను వినియోగించుకోవడం కుదరదని తేల్చి చెప్పింది.