: మధ్యతరగతికి సౌలభ్యంగా విమానయానం, గరిష్ఠ టికెట్ ధర రూ. 2,500... కొత్త ముసాయిదా ఇదే!


దేశంలోని మధ్యతరగతి ప్రజలకు విమానయానాన్ని దగ్గర చేసే లక్ష్యంతో సరికొత్త ఏవియేషన్ పాలసీ ముసాయిదాను విమానయాన శాఖ ఈ ఉదయం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా చిన్న చిన్న విమానాశ్రయాల సంఖ్యను పెంచడం, నిర్వహణా వ్యయాలను తగ్గించడం ప్రధానంగా తయారైన ముసాయిదాపై పరిశ్రమ వర్గాలు, ప్రజల స్పందనను కోరిన కేంద్రం, త్వరలోనే దీనికి తుది రూపు ఇవ్వనుంది. దేశవాళీ విమానయాన సంస్థల్లో ఎఫ్డీఐ (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)ని 50 శాతం వరకూ అనుమతించాలని కూడా ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయి. విమానయాన సంస్థలపై ఒత్తిడిని తగ్గించేందుకు పన్ను రాయితీలు, విమాన మరమ్మతులపై సేవా పన్ను రాయితీలను ప్రతిపాదించారు. సమయానుకూలంగా ఈ రంగాన్ని సమీక్షిస్తూ, ఎప్పటికప్పుడు నూతన నిర్ణయాలు తీసుకోవాలని, ఒక గంట ప్రయాణ సమయమున్న నగరాలు, పట్టణాల మధ్య మరింతగా సర్వీసులను పెంచాలని తెలిపారు. ఈ నగరాల మధ్య గరిష్ఠంగా టికెట్ ధర రూ. 2,500కు మించకుండా చూడాలని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ధర పెరిగినట్లయితే, దాన్ని ప్రభుత్వం విమానయాన సంస్థలకు చెల్లిస్తుందని ముసాయిదాలో ఉంది. దేశవాళీ, అంతర్జాతీయ రూట్లలో కమర్షియల్ విమానాల్లో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్లో 2 శాతం రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయాలు అమలైతే తక్కువ దూరాలు ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉంటుందని ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News