: ఓరుగల్లు ఉప బరిలో నోట్ల కట్టల పంపిణీ షురూ...హసన్ పర్తిలో రూ.లక్ష పట్టివేత


వరంగల్ లోక్ సభకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఇంకా నామినేషన్ల ప్రక్రియే పూర్తి కాలేదు. అప్పుడే డబ్బు పంపిణీ జోరందుకుంది. ఈ ఎన్నికలో ప్రధాన పోటీ నెలకొన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇంకా తమ పార్టీల అభ్యర్థులను ప్రకటించలేదు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కూడా ఇంకా ఖరారు కాలేదు. అప్పుడే డబ్బుల పంపిణీ మొదలుకావడంతో ఎన్నికల సంఘం పోలీసులను రంగంలోకి దించింది. వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం అన్నాసాగర్ వద్ద వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు ఓ కారులో తరలిస్తున్న రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News