: లేడీ కానిస్టేబుల్ గురించి వివాదం... కానిస్టేబుల్ ను చంపిన హెడ్ కానిస్టేబుల్


మోటార్ సైకిల్లో బాంబు పెట్టి తోటి కానిస్టేబుల్ ను దారుణంగా హతమార్చాడో హెడ్ కానిస్టేబుల్. ఓ లేడీ కానిస్టేబుల్ కు సంబంధించిన వివాదమే దీనికి కారణం. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో జరిగింది. శివర్ధన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న నితేష్ పాటిల్ (28)కి అక్కడే పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తో వివాహేతరం సంబంధం ఉందనే కోపంతో హెడ్ కానిస్టేబుల్ ప్రహ్లాద్ పాటిల్ (45) మోటార్ బైక్ లో బాంబు పెట్టాడు. ఈ క్రమంలో బైక్ కిక్ కొట్టగానే బాంబు పేలి, నితేష్ పాటిల్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని ఆసుపత్రికి హుటాహుటీన తరలించారు. చికిత్స పొందుతూ నితేష్ మరణించాడు. మహిళా కానిస్టేబుల్ తో సంబంధం విషయమై వీరిద్దరి మధ్య అనేక సార్లు గొడవ జరిగిందని సహచరులు చెబుతున్నారు. మరణించిన నితేష్ కు పెళ్లయి రెండున్నర నెలల పాప కూడా ఉంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.

  • Loading...

More Telugu News