: వరి దెబ్బతింటోంది, నాకీ పదవి వద్దు: తెదేపా ఎమ్మెల్యే


కృష్ణా డెల్టాలో సాగునీరందక వరి పంట ఎండిపోతున్నదని, తక్షణం నీటిపారుదల శాఖ చర్యలు తీసుకుని నీటిని అందించకుంటే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కృష్ణ జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత వెంకటరావు హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చిస్తానని, అప్పటికీ నీరు అందకుంటే రాజీనామాపై ఆలోచిస్తానని అన్నారు. పెడన నియోజకవర్గంలో పొలాలకు నీరందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపిన ఆయన, వారి కష్టాలను తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనకు చంద్రబాబుతో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసిన కాగిత, తమ ప్రాంతంలోని పొలాలు ఎండకుండా చూడాలని కోరారు. కాగా, డెల్టాలో గతంలో ఎన్నడూ లేనంత కరవు ఏర్పడటంతో, రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత తెలుగుదేశం నేతలకు ఇబ్బంది కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News