: సచిన్... స్కూల్ స్థాయి క్రికెట్ కే పరిమితమయ్యాడు!: బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్ సెటైర్లు


ప్రపంచ క్రికెట్ లోనే దిగ్గజంగా ఎదిగిన భారతరత్న సచిన్ టెండూల్కర్ పై భారత బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్ సెటైర్లు సంధించాడు. ప్రతిభకు తగ్గట్టుగా సచిన్ రాణించలేదని, అసలు తనలోని ప్రతిభకు సచిన్ న్యాయం చేయలేదని కూడా కపిల్ వ్యాఖ్యానించాడు. దుబాయిలోని కోవ్ బీచ్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కపిల్ నిన్న ఈ మేరకు సచిన్ పై విమర్శనాస్త్రాలు సంధించాడు. క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ ఆట స్కూల్ స్థాయిలోనే ఆగిపోయిందని కపిల్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యధిక శతకాలు సాధించి రికార్డు నెలకొల్పిన సచిన్, సదరు సెంచరీలను డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా మలచుకోవడంలో విఫలమయ్యాడన్నాడు. ‘‘సచిన్ ముంబై స్థాయి క్రికెట్ కే పరిమితమయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో ఊచకోత క్రికెట్ ఆడేందుకు తన వంతు ప్రయత్నం చేయలేదు. పద్ధతైన క్రికెట్ ఆడే ముంబై ఆటగాళ్లతో కాకుండా వివ్ రిచర్డ్స్ లాంటి వారితో ఎక్కువ సమయం గడిపి ఉంటే సచిన్ దృక్పథం మారి ఉండేది. సచిన్ ది కచ్చితమైన టెక్నిక్. అతడిలో తగిన సామర్ధ్యం కూడా ఉంది. కానీ శతకం సాధించడంపైనే ఎక్కువ దృష్టి సారించేవాడు. ఆటను ఎంజాయ్ చేయమని, సెహ్వాగ్ లా ఆడమని సూచించా. అయినా ఫలితం లేకపోయింది’’ అని కపిల్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News