: తొలితరం గాయనీమణి శంషాద్ బేగం కన్నుమూత


ఎన్నో హిందీ చిత్రాలకు గాత్రదానం చేసిన ప్రముఖ గాయనీమణి శంషాద్ బేగం(94) ఈ రోజు ముంబైలో తుదిశ్వాస విడిచారు. హిందీ చిత్ర సీమలో తొలితరం గాయనీమణులలో శంషాద్ బేగం కూడా ఒకరు. 1919 ఏప్రిల్ 14న పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించిన శంషాద్ తన కెరీర్ ప్రారంభంలో ఒక పాట పాడినందుకు 15రూపాయల పారితోషికం పుచ్చుకున్నారు. ఈమె సుమధుర గాత్రానికి మంచి ఆదరణ రావడంతో అటుపై భారీగా అవకాశాలు వచ్చాయి. నేటికీ ఈమె పాడిన పాటలు ఆణిముత్యాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. లెకే పెహ్లా పెహ్లా ప్యార్, కజ్రా మొహబత్ వాలా అంకియోన్ మేన్ ఐసా దాలా... ఇలా ఎన్నో పాటలు శంషాద్ ఆలపించినవే. ఈమెకు కె.ఎల్.సైగల్ అంటే పిచ్చి అభిమానం. దేవదాస్ సినిమాను 14 సార్లు చూశారట.

  • Loading...

More Telugu News