: ‘రాజు’ల కోటలో లిటిల్ ‘మాస్టర్’... ప్రాక్టీస్ మ్యాచ్ లో బిజీబిజీ
క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ రమేశ్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఏపీలోని విజయనగరంలో మకాం వేశాడు. ఓ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం వచ్చిన అతడు మైదానంలో ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతర్ రాష్ట్ర అండర్-16 క్రికెట్ మ్యాచ్ లలో భాగంగా ముంబై, విదర్భల మధ్య త్వరలో విశాఖలో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల పాటు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ విజయనగరంలోని విజ్జీ మైదానంలో నిన్న ప్రారంభమైంది. టాస్ గెలిచిన ముంబై జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ముంబై జట్టులో సభ్యుడైన అర్జున్ టెండూల్కర్ 7 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.