: ఐఎస్ఐఎస్ బ్రిటన్ లో భారీ విధ్వంసానికి కుట్ర చేస్తోంది: బ్రిటన్ భద్రతాధికారి
ఐఎస్ఐఎస్ బ్రిటన్ లో భారీ విధ్వంసానికి కుట్రచేస్తోందని యూకే భద్రతా విభాగం ప్రకటించింది. బ్రిటన్ లో ఐసిస్ పెను విధ్వంసానికి స్కెచ్ వేస్తోందని, వాటి కుట్రను భగ్నం చేయడానికి భద్రతా విభాగాన్ని పటిష్ఠం చేయాలని బ్రిటన్ భద్రతా విభాగం ఎమ్ఐ5 డైరెక్టర్ జనరల్ ఆండ్రూ పార్కర్ తెలిపారు. బ్రిటన్ పై దాడులు చేసేందుకు గల అవకాశాలు ఇంత ఎక్కువగా గతంలో ఎన్నడూ చూళ్లేదని అన్నారు. గతేడాది బ్రిటన్ లో ఆరు ఉగ్రదాడులను భగ్నం చేశామని ఆయన చెప్పారు. బ్రిటన్ నుంచి 750 మంది సిరియాలో ఉగ్రవాద శిక్షణకు వెళ్లడం బ్రిటన్ పై దాడులకు అవకాశం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. టీనేజర్లు, యువకులలో ఉండే ఉద్రేకాన్ని రెచ్చగొట్టి ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రయోజనం పొందుతున్నాయని, వారే ఉగ్రవాదం ఉచ్చులో చిక్కుతున్నారని ఆయన తెలిపారు. ఆధునిక సమాచార వ్యవస్థను వినియోగించుకుని ఐసిస్ ఉగ్రవాదులు యువతను ఆకర్షిస్తున్నారని, బ్రిటన్ చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.