: ఇప్పటివరకు తినలేదు... ఇకపై గోమాంసం తింటాను: కర్ణాటక సీఎం


‘ఇప్పటి వరకు నేను గోమాంసం తినలేదు. అయితే, బీజేపీ నేతల చర్యలను చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. ఇకపై గోమాంసం తింటాను’ అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోమాంసం తినకూడదంటూ ప్రజలపై బీజేపీ ఒత్తిడి తేవడం సబబు కాదన్నారు. బీఫ్ తిన్న వారిపై దాడులకు పాల్పడుతున్న బీజేపీ నాయకుల పద్ధతి ఏమాత్రం బాగుండలేదన్నారు. అసలు.. బీఫ్ తింటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఆహారపు అలవాట్లు ఆయా వ్యక్తులను అనుసరించి ఉంటాయని, గోమాంసం అందుకు అతీతమేమి కాదని అన్నారు. బీఫ్ పై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు ఇటువంటి విషయాలపై కాకుండా దేశాభివృద్ధిపై దృష్టి సారించాలని సిద్ధ రామయ్య హితవు పలికారు.

  • Loading...

More Telugu News