: గుంటూరు జీజీహెచ్ డిప్యూటీ సివిల్ సర్జన్ పై సస్పెన్షన్ వేటు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో పారిశుద్ధ్యం సక్రమంగా లేనందున డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ శ్రీనివాసులును సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అరుణకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు ఆయనకు అందజేశారు. ఇటీవల జీజీహెచ్ లోని చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగంలో ఓ పసికందును ఎలుక కరవడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.