: అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు రాష్ట్రపతి ప్రశంసలు


అరుణాచల్ ప్రదేశ్ ప్రజల కోసం తీసుకొచ్చిన ఆరోగ్య సంరక్షణ పథకం సాధారణమైంది కాదంటూ ముఖ్యమంత్రి నబం టుకీపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా టుకీని రాష్ట్రపతి భవన్ కు ఆహ్వానించిన ప్రణబ్ ఆయనతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎవ్వరూ ప్రవేశపెట్టని ఉదారమైన పథకాన్ని టుకీ తీసుకొచ్చారంటూ ఆయన్ని అభినందించారు. ఈ పథకాన్ని భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు ప్రారంభిస్తాయని ఆశిస్తున్నట్లు ప్రణబ్ పేర్కొన్నారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఇన్స్యూరెన్స్ స్కీం కింద సెప్టెంబర్ 16, 2014 న ప్రారంభించారు. ఈ పథకం కింద ఇప్పటికే లక్షా అరవై వేల కుటుంబాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. దీని ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేకుండానే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వీరు వైద్య సేవలు పొందవచ్చు. ఈ పథకం నిమిత్తం బయోమెట్రిక్ లింక్ చేసిన ఒక ప్రత్యేక కార్డును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

  • Loading...

More Telugu News