: హైదరాబాద్ లో 10 కేంద్రాల్లో కందిపప్పు అమ్మకాలు


తెలంగాణ పప్పు మిల్లుల యజమానులతో పౌర సరఫరాల కమిషనర్ చర్చలు జరిపారు. హైదరాబాద్ లో పది కేంద్రాల్లో కందిపప్పు అమ్మకాలకు నిర్ణయం తీసుకున్నారు. మొదటిరకం కందిపప్పు కిలో రూ. 160కి, రెండో రకం కందిపప్పు కిలో రూ. 130కి అమ్మేందుకు పప్పు మిల్లుల యజమానులు అంగీకరించారు. ఒక్కొక్క కుటుంబానికి కిలో కందిపప్పు చొప్పున విక్రయిస్తారు. తెలంగాణలోని జిల్లా, మండల కేంద్రాల్లో కూడా కందిపప్పు విక్రయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పౌరసరఫరాల అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News