: ప్రతి విషయాన్ని రాజకీయం చేయద్దు: మంత్రి వెంకయ్యనాయుడు
ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం కొందరికి అలవాటై పోయిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. కేంద్ర మంత్రి మహేశ్ శర్మకు అర్హత ప్రకారమే ప్రభుత్వ బంగళాను కేటాయించారని అన్నారు. ప్రభుత్వ బంగ్లాలను స్మృతి కేంద్రాలుగా మార్చకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఢిల్లీలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నివసించిన భవనం ప్రభుత్వ బంగళానే అని, అందుకే మంత్రి శర్మకు కేటాయించామని ఆయన వివరించారు.