: డుమిని డౌటే...మోర్కెట్ ఫిట్


నవంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న తొలిటెస్టు తుదిజట్టులో ఆల్ రౌండర్ డుమినికి చోటు లభించడం కష్టమేనని సౌతాఫ్రికా జట్టు మీడియా మేనేజర్ తెలిపారు. పూర్తి ఫిట్ నెస్ సాధించని కారణంగా డుమినికి జట్టులో చోటు కల్పించడం లేదని తెలిపారు. అదే సమయంలో గాయం నుంచి కోలుకున్న మోర్నీ మోర్కెల్ తొలి టెస్టులో ఆడేందుకు సిద్ధమయ్యాడని ఆయన తెలిపారు. మోర్కెల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, తొలి టెస్టులో ఆడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కాగా, మూడో వన్డేలో ధోనీ కొట్టిన బలమైన షాట్ ను అడ్డుకునే ప్రయత్నంలో డుమిని కుడి చేతికి బలమైన గాయమైంది. ఈ గాయం కారణంగా మంచి ఫాంలో ఉన్న జేపీ డుమిని చివరి రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఇప్పుడు తొలి టెస్టుకు కూడా దూరమయ్యాడు.

  • Loading...

More Telugu News