: జూన్ లోగా రావాల్సిందే...ఉద్యోగులకు స్పష్టం చేసిన సీఎం


ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు హైదరాబాదు నుంచి జూన్ లోగా విజయవాడకు తరలిరావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీ సచివాలయ ఉద్యోగులకు స్పష్టం చేశారు. విజయవాడలో సచివాలయ ఉద్యోగులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను విజయవాడలో ఉంటే ఉద్యోగులు హైదరాబాదులో ఉండడం సరైనదేనా? అని అడిగారు. కార్యాలయాలు, శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తే వచ్చేసేందుకు అభ్యంతరం లేదని ఉద్యోగులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం తక్షణం శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయడం అసాధ్యమని పేర్కొన్న ఆయన తాత్కాలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విజయవాడకు వచ్చేసేందుకు ఇబ్బంది లేదని, విద్యాసంవత్సరం మధ్యలో ఉన్న కారణంగా కుటుంబంతో రావడం కష్టమని అందుకే హైదరాబాదు, విజయవాడల్లో హెచ్ఆర్ఏ ఇవ్వాలని ఉద్యోగులు సీఎంను కోరారు. వారి కోరిక అసంబద్ధమైనదని, అలా రెండు చోట్లా హెచ్ఆర్ఎ ఇవ్వడం కుదరదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News