: ఏపీలో 6 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల విధానంలో సంస్కరణల అమలుకు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షల విధానంలో సంస్కరణలు అమలు చేసేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి సంస్కరణలను అమలు చేయబోతోంది. సంస్కరణల అమలుకు చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. దాంతో ఇకపై పరీక్షల నిర్వహణలో ఫార్మాట్ ఎస్సెన్ మెంట్, సమ్మెటివ్ ఎస్సెన్ మెంట్ విధానాన్ని అమలు చేయనున్నారు. పదో తరగతిలో మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంస్కరణలు అమలు అవుతాయి.