: మంత్రులకు వరంగల్ లోక్ సభ అభ్యర్థిని గెలిపించే బాధ్యతలు
వరంగల్ లోక్ సభ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ఈ స్థానం నుంచి పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను సీఎం కేసీఆర్ మంత్రులపై పెట్టారు. ఈ మేరకు వరంగల్ లోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగించారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. మంత్రి ఈటెల రాజేందర్ కు- పరకాల, హరీష్ రావుకు-వరంగల్ (తూర్పు), కేటీఆర్ కు- వరంగల్ (పశ్చిమ), జగదీశ్ రెడ్డికి- పాలకుర్తి, పోచారంకు-భూపాల్ పల్లి, ఇంద్రకరణ్ రెడ్డికి-స్టేషన్ ఘన్ పూర్, జోగు రామన్నకు- వర్థన పేట నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు.