: ఒక బిడ్డనే కనాలనే నిబంధనకు ముగింపు పలికిన చైనా


ఒక జంట ఒకే బిడ్డకు జన్మనివ్వాలనే అత్యంత వివాదాస్పద నిబంధనకు చైనా ముగింపు పలికింది. ఇకపై ఒక జంట ఇద్దరు పిల్లలను కనొచ్చని నిబంధనలు మార్చింది. ఈ వివరాలను అధికారిక జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నాలుగు రోజుల పాటు అధికారిక కమ్యూనిస్ట్ పార్టీ చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఒక బిడ్డనే కనాలనే నిబంధనను తొలగించడం పట్ల చైనాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బిడ్డనే కనాలనే కఠిన నిబంధనతో ఇంతకాలం చైనీయులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకనొక బిడ్డకు మధ్యలో ఏమైనా అయితే... ఆ తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోయేవారు. వృద్ధాప్యంలో వారి మంచి చెడ్డలు చూసేవారు కూడా ఉండేవారు కాదు.

  • Loading...

More Telugu News