: అమెరికా షాపింగ్ మాల్ లో కాల్పుల కలకలం


అమెరికాలోని షాపింగ్ మాల్ లో కాల్పుల కలకలం రేగింది. ఇండియానా పోలిస్ నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో ఆగంతుకుడు కాల్పులు జరపడంతో ముగ్గురు గాయపడ్డారు. వాషింగ్టన్ స్క్వేర్ షాపింగ్ మాల్ కు ముసుగు ధరించిన ఓ వ్యక్తి వచ్చాడు. మాల్ లో ఓ వ్యక్తితో గొడవపడ్డాడు. అకస్మాత్తుగా అతను తుపాకీ తీసి అతనిపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు, ఓ స్త్రీ గాయపడ్డారు. కాగా, కాల్పులు జరిపిన వ్యక్తి ముసుగు ధరించి ఉన్నాడని, గుర్తుపట్టడం కష్టమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆగంతుకుడి కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News