: ఘనంగా హర్భజన్-గీతాబస్రాల వివాహం... హాజరైన సచిన్, అంజలి దంపతులు


టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతా బస్రాలు పెళ్లితో ఒక్కటయ్యారు. పంజాబీ సంప్రదాయంలో ఫగార్వాలో ఉన్న గురుద్వారాలో వారి వివాహం జరిగింది. భజ్జీ తెలుపు రంగు శేర్వానీ, ఎరుపు రంగు చుడీదార్, టర్బన్ ధరించగా, బస్రా... హెవీ ఎంబ్రాయిడరీతో రూపొందించిన ఎరుపు రంగు లెహంగా ధరించి పెళ్లికూతురుగా మెరిసిపోయింది. ఈ వివాహానికి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వారితో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, సతీమణి అంజలి కూడా హాజరయ్యారు. నవంబర్ 1న భజ్జీ-బస్రాల వివాహ రిసెప్షన్ ఢిల్లీలో గ్రాండ్ గా జరగనుంది.

  • Loading...

More Telugu News