: వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిని రేపు కేసీఆర్ ప్రకటిస్తారు: డిప్యూటీ సీఎం కడియం


వరంగల్ లోక్ సభకు అభ్యర్థిని ఖరారు చేసే విషయంపై వరంగల్ జిల్లా పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థి పేరును రేపు ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. అది కూడా స్వయంగా కేసీఆరే ప్రకటిస్తారని చెప్పారు. వరంగల్ జిల్లాకు చెందిన వారికి, ఉద్యమంలో పాల్గొన్న వారికే పార్టీ సీటు దక్కుతుందని గతంలో చెప్పామని, ఇప్పుడూ అదే చెబుతున్నామని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు కూడా ఇదే విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారని అన్నారు.

  • Loading...

More Telugu News