: వేల ఎకరాలు సేకరించారు... ఇంకా ఎందుకు భయపెడుతున్నారు?: వైకాపా నేత పార్థసారథి
అమరావతి ప్రాంతంలోని రైతులను ప్రభుత్వం భయపెడుతోందని వైకాపా నేత పార్థసారథి ఆరోపించారు. భూములు ఇవ్వడానికి ముందుకు రాని రైతులను వేధిస్తున్నారని అన్నారు. ఇప్పటికే వేలాది ఎకరాలను సేకరించారని... అయినా, రైతులను ఇంకా ఎందుకు భయపెడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం యొక్క భూదాహం ఇంకా తీరినట్టు లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు సేకరించిన భూముల్లోనే రాజధానిని నిర్మించాలని... ఇకపై బలవంతంగా భూములను లాక్కోవద్దని సూచించారు. వైకాపా అధికారంలోకి వస్తే బలవంతపు భూసేకరణ చేయదని... ఇలాంటి కార్యక్రమానికి తాము వ్యతిరేకమని చెప్పారు.