: తన టాలెంట్ కు సచిన్ సరైన న్యాయం చేయలేదు!: కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు


"మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు సెంచరీలు చేయడమే తెలుసు. వాటిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా మార్చడం ఎలాగన్నది తెలియదు. అదే తెలిసుంటే, సచిన్ మరింత ఎత్తులో ఉండేవాడు" ఈ మాటలన్నది ఎవరో కాదు. లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్. సచిన్ లో ఆపారమైన ప్రతిభ ఉన్నా దానికి అతను సరైన న్యాయం చేయలేదట. ఎన్నో డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సచిన్ ఖాతా నుంచి మిస్ అయ్యాయని, తన మాటలను తప్పుగా అనుకోవద్దని కపిల్ వ్యాఖ్యానించాడు. తాను తన అనుభవాన్ని మరింతగా వాడుకుని ఉంటే ఇంకా ఎక్కువ సమయం సేవలందిస్తూ ఉండేవాడన్నదే తన అభిప్రాయమని కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News