: అధికార పార్టీకి అనుకూలంగా జీహెచ్ ఎంసీలో వార్డుల విభజన చేశారు: బీజేపీ నేత లక్ష్మణ్
గ్రేటర్ హైదరాబాద్ లో వార్డుల విభజన చేసిన తీరుపై బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. అధికార పార్టీకి అనుకూలంగా వుండే విధంగా వార్డులను విభజించారని ఆరోపించారు. ప్రతిపక్షాలకు పట్టున్న ప్రాంతాల్లో వార్డులను విభజించి, టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నచోట విభజన చేయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. 250 వార్డులకు పెంచుతామని ప్రకటించిన జీహెచ్ ఎంసీ కమిషనర్, ఆఖరికి 150 వార్డులకు పరిమితం చేయటం సరికాదని మండిపడ్డారు. ఇక వరంగల్ ఉమ్మడి అభ్యర్థి పేరు రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. వరంగల్ లో పోటీ చేసేందుకు టీడీపీ కూడా ప్రయత్నిస్తోందన్న లక్ష్మణ్, టీడీపీతో మాట్లాడాక ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.