: బాలీవుడ్ లో ఇలాంటి నటుడ్ని చూడలేదంటున్న దర్శకుడు
ఏబీసీడీ (ఎనీ బడీ కెన్ డాన్స్) సినిమా ద్వారా దర్శకుడిగా నిరూపించుకున్న నృత్యదర్శకుడు రెమో డిసౌజా 'ఫ్లైయింగ్ జాట్' పేరిట సూపర్ హీరో స్టోరీతో మరో సినిమాను రూపొందిస్తున్నాడు. 'హీరో పంతి' సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన జాకీష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో 'ఫ్లైయింగ్ జాట్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో 'మ్యాడ్ మ్యాక్స్ ప్యూరీ' సినిమాలో నటించి మెప్పించిన నతన్ జోన్స్ కనువిందు చేయనున్నాడు. ఈ సినిమాలో పోరాట సన్నివేశాల్లో విలన్ పది కేజీల బరువుండే ఆయుధాలు చేతులకు ధరించాల్సి ఉంటుంది. ఒరిజనల్ ఆయుధాల స్ధానంలో డూప్లికేట్ ఆయుధాలు తయారు చేసి చేతులకు ధరించి షూట్ చేసి, ఒరిజనల్ ఆయుధాలు గ్రాఫిక్స్ లో కలుపుదామని దర్శకుడు సూచించగా, నిరాకరించిన నతన్ జోన్స్ ఒరిజనల్ ఆయుధాలతోనే రోజుకు పది గంటలపాటు షూటింగ్ లో పాల్గొని యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. నతన్ జోన్స్ అంకితభావానికి ముగ్ధుడైన రెమో డిసౌజా బాలీవుడ్ లో అలాంటి నటుడిని ఇంతవరకు చూడలేదని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు. కాగా, నతన్ జోన్స్ ప్రపంచ స్ధాయి రెజ్లర్ అన్న విషయం తెలిసిందే.