: విజయవాడ రావడానికి ఏపీ ఉద్యోగులు ఎలాంటి షరతులు పెట్టడంలేదు: మురళీకృష్ణ


ఏపీ ఉద్యోగులందరూ జూన్ 2 నాటికి రాజధాని అమరావతికి వస్తారని సీఎం చంద్రబాబుకు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ హామీ ఇచ్చారు. ఈ మేరకు విజయవాడలోని సీఎం కార్యాలయంలో సహోద్యోగులతో కలసి ఆయన చంద్రబాబును కలిశారు. అనంతరం మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు విజయవాడకు వచ్చేందుకు షరతులు పెడుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎంకు చెప్పానన్నారు. ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడున్నాయో చెబితే వెంటనే తెలంగాణ నుంచి అమరావతికి వచ్చేస్తామని తెలిపామన్నారు. ఉద్యోగుల పీఆర్సీ, లోన్, అడ్వాన్సుల జీవోలను వెంటనే విడుదల చేయాలని సీఎంను కోరారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని మురళీకృష్ణ చెప్పారు. డీఏ పెండింగ్ కూడా వెంటనే విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు వివరించారు. అమరావతిలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చంద్రబాబును తాము కోరామన్నారు. తమ డిమాండ్లన్నింటికీ సీఎం అంగీకారం తెలిపారని చెప్పారు.

  • Loading...

More Telugu News