: దోహా నుంచి ముంబైకి వచ్చింది, ఢిల్లీకి వెళ్లలేకపోయింది... కారణం పొట్టిదుస్తులట!
ఆమె ఓ ఎయిర్ హోస్టెస్ సోదరి. దోహా నుంచి ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో ముంబైకి వచ్చింది. అక్కడి నుంచి ఆమె ఢిల్లీకి వెళ్లాలి. తాను ప్రయాణించాల్సిన విమాన సిబ్బంది ఆమెను విమానం ఎక్కేందుకు అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? ఆమె పొట్టి దుస్తులు ధరించిందట. ఈ విషయాన్ని సహ ప్రయాణికురాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో సిబ్బంది ఆమెను విమానంలోకి అనుమతించేందుకు నిరాకరించారట. ఆమె ఏమంత పొట్టి దుస్తులు ధరించలేదని, ఎయిర్ హోస్టెస్ లు ధరించే దుస్తులతో పోలిస్తే పొడుగైన దుస్తులే ధరించిందని ఆమె తన పోస్టులో వివరించింది. ఇదే విషయమై ఇండిగోను సంప్రదించగా, దేశవాళీ ప్రయాణాల్లో ఫ్రాక్ ధరించి ప్రయాణానికి అనుమతించడం లేదని చెప్పడం గమనార్హం. డ్రస్ కోడ్ నిబంధనలను తాము పాటించామని, ఆమె తన దుస్తులు మార్చుకుని వచ్చిన తరువాత మరో విమానంలో ఆమెకు సీటిచ్చామని ఓ అధికారి తెలిపారు.