: భోరున విలపించిన బాలీవుడ్ భామ
బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ భోరున విలపించింది. సినిమాలో కాదండోయ్... నిజంగానే. ఇటీవల ముంబై బాంద్రాలో ఉన్న ఓ చర్చికి వెళ్లిన కత్రినా... మేరీమాత ముందు తనను తాను నియంత్రించుకోలేక ఏడ్చేసిందట. మీడియాకు చెందిన ఓ వ్యక్తి ఈ సన్నివేశాన్ని క్లిక్ మనిపించాడు. దీన్ని గమనించిన కత్రినా ఫొటోలు బయటపెట్టవద్దని కోరిందట. అయినా, ఈ వార్త ఆ నోట, ఈ నోట అలాఇలా పాకుతూ మొత్తానికి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే బీ-టౌన్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అట. కత్రినాకు ఏమైంది? ఎందుకు ఏడ్చింది? ఇదే ప్రశ్న. మరికొందరు దీనికి సమాధానం వెతికే పనిలో కూడా పడ్డారు. సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం ముగిసిన తర్వాత రణబీర్ కపూర్ తో గత మూడేళ్లుగా కత్రినా డీప్ లవ్ లో ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రావడమే కాని... అది ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లింది లేదు. మరోవైపు, పెళ్లికి కత్రినా సిద్ధంగా ఉన్నా, రణబీర్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని కొందరు చెబుతున్నారు. ఈ టెన్షన్, ఫ్రస్టేషన్ లోనే కత్రినా తనను తాను నియంత్రించుకోలేక భోరున విలపించిందని అనుకుంటున్నారు.