: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం... ఏపీ ఆర్థిక మంత్రి యనమల
నవ్యాంధ్రప్రదేశ్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రుణమాఫీ అమలుపై ఏర్పాటైన సబ్ కమిటీ నేటి ఉదయం విజయవాడలో భేటీ అయ్యింది. ఈ సమావేశానికి హాజరైన ఆయన భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి ఏమీ బాగోలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వాణిజ్య పన్నులు సహా ఆబ్కారీ ఆదాయం, రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే సహకారం కోసం తాము ఎదురుచూస్తున్నామని యనమల చెప్పుకొచ్చారు.