: బీజేపీ నేతలు ఏమన్నా సర్దుకుపోండి: ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్!
ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన చంద్రబాబునాయుడు, బహిరంగ వ్యాఖ్యలు చేసేముందు స్వీయ నియంత్రణ పాటించాలని సలహా ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీ నేతలు ఏవైనా విమర్శలు చేస్తే, ప్రతిగా మీడియా ముందు మాట్లాడటం కన్నా సర్దుకుపోయే తత్వాన్ని అలవరచుకోవాలని ఆయన హితవు పలికారు. బీజేపీపై వ్యాఖ్యలు చేసేటప్పుడు సమన్వయం పాటించాలని, విమర్శలతో ఇరు పార్టీలకూ నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని నిత్యమూ గుర్తెరగాలని క్లాస్ తీసుకున్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటుంటే ప్రజల్లో చలకనైపోతారని హెచ్చరించారు. అమరావతి ప్రాంతంలో మిగిలిన భూమిని సైతం రైతులే స్వచ్ఛందంగా ఇచ్చేలా చూడాలని, అందుకోసం ప్రజాప్రతినిధులు స్వయంగా వారి వద్దకు వెళ్లి, నచ్చజెప్పాలని చంద్రబాబు సూచించారు.