: తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ ఈ ఉదయం సమావేశమయింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, శాసనసభలో ఆ పార్టీ నేత లక్ష్మణ్, వరంగల్ లోక సభ ఉప ఎన్నిక ఇన్ ఛార్జ్ పేరాల చంద్రశేఖర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వరంగల్ ఉప ఎన్నికపైనే వీరు ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎన్డీయే తరపున నిలబెట్టాల్సిన అభ్యర్థి, టీడీపీతో కలసి ప్రచార నిర్వహణ తదితర అంశాలపై నేతలంతా చర్చలు జరుపుతున్నారు.