: ఆర్టీఏ కార్యాలయంలో రాంచరణ్, ఉపాసన
ప్రముఖ టాలీవుడ్ హీరో రాంచరణ్, ఆయన సతీమణి ఉపాసనలు హైదరాబాద్ లోని ఖైరతాబాదులో ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి నిన్న మధ్యాహ్నం వచ్చారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా, ఫొటోలు దిగడమే కాకుండా, డిజిటల్ సంతకాలు, వేలిముద్రలను ఆర్టీఏ అధికారులకు సమర్పించారు. వీరి రాకతో ఆర్టీఏ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. రద్దీ తక్కువగా ఉన్న సమయంలో వస్తే బాగుంటుందని రామ్ చరణ్ కు ఆర్టీఏ అధికారులు ముందుగానే సూచించడంతో... వీరిద్దరూ మధ్యాహ్న సమయంలో వచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.