: హేమమాలిని కున్నంత సీన్ కూడా నాకు లేదా?: శత్రుఘ్న సిన్హా
ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా తీవ్ర ఆవేదనను వెళ్లగక్కారు. బీహార్ ఎన్నికల సందర్భంగా ఇతర నటులు హేమమాలిని, అజయ్ దేవగన్ లతో బీజేపీ ప్రచారం చేయించుకుందని... బీజేపీ ఎంపీ అయిన తనను మాత్రం ఉపయోగించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. హేమమాలిని, అజయ్ దేవగన్ లకు ఉన్నంత సీన్ కూడా తనకు లేదా? అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. బీహారుకు చెందిన తనను ఎన్నికల ప్రచారంలో లేకుండా చేయడానికి కొందరు కుట్ర చేశారని ఆరోపించారు. ట్విట్టర్ లో సొంత పార్టీ బీజేపీపై తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని... కేవలం ప్రజాసమస్యలను మాత్రమే ప్రస్తావించానని చెప్పారు. ఓ సందర్భంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను శత్రుఘ్న సిన్హా పొగిడారు. ఈ క్రమంలోనే, బీజేపీ నాయకత్వం ఆయనను పక్కన పెట్టింది.