: ఎంతోమందికి ఫేవరెట్ అయిన ఆ అంతర్జాతీయ దొంగ మరోసారి అరెస్ట్!


డోరిస్ పేనీ... ఇంటర్నేషనల్ జ్యుయెల్ థీఫ్. 1952 నుంచి ఎన్నో చోట్ల ఆభరణాలు దొంగిలించిన ఆమె వయసు ఇప్పుడు 85. ఇకపై ఆమె రిటైర్ మెంట్ ప్రకటించాలేమో! ఎందుకంటే, తాజాగా, అట్లాంటాలోని ఓ స్టోర్ లో సుమారు 690 డాలర్ల విలువైన చెవి రింగులను దొంగిలించి ఆమె దొరికిపోయింది. ఈ కేసులో డోరిస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచంలో అత్యధిక కాలం వజ్రాల దొంగగా రికార్డు ఆమె సొంతం. ఎన్నోమార్లు జైలుకు వెళ్లివచ్చిన ఆమెకున్న అభిమానుల సంఖ్యా తక్కువేమీ కాదు. "ది లైఫ్ అండ్ క్రైమ్స్ ఆఫ్ డోరిస్ పేనీ" పేరిట 2013లో ఓ డాక్యుమెంటరీని ఆమె జీవితంపై తీయగా, అది సూపర్ హిట్టయింది. తాజా దొంగతనం కేసు విచారణలో భాగంగా ఆమెను ఫ్లూటన్ కౌంటీ జైలుకు తరలించగా, 2,500 డాలర్ల విలువైన బాండ్లను సమర్పించి జైలు నుంచి బెయిల్ పై విడుదలైంది. తన 23 ఏళ్ల వయసులో పిట్స్ బర్గ్ లోని ఓ ఆభరణాల దుకాణం నుంచి 22 వేల డాలర్ల విలువైన వజ్రాల దొంగతనంతో పేనీ పేరు తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. పోలీసులను ఏమార్చేందుకు 20 మార్లు పేర్లు మార్చుకున్న పేనీ, తొమ్మిది పుట్టిన రోజు పత్రాలను సృష్టించి ఐదు సోషల్ సెక్యూరిటీ సంఖ్యలను తీసుకుంది కూడా. ఈ తాజా కేసులో నిందితురాలి వయసును దృష్టిలో ఉంచుకుని బెయిలిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.

  • Loading...

More Telugu News