: సంగీత్ లో స్టెప్పులేసిన భజ్జీ... చక్కర్లు కొడుతున్న వీడియో
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పెళ్లి కొడుకయ్యాడు. నేడు పంజాబ్ లోని జలంధర్ లో తాను ప్రేమించిన గీతా బస్రాను అతడు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోనున్నాడు. రెండు రోజుల క్రితమే పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. క్రికెట్ కు కాస్తంత రెస్ట్ ఇచ్చిన భజ్జీ పెళ్లి దుస్తుల్లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. మొన్న రాత్రి జరిగిన సంగీత్ తో బంధువర్గంతో కలిసి భజ్జీ పంజాబీ స్టైల్లో స్టెప్పులేశాడు. స్వల్ప నిడివితో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ భాషలకు చెందిన న్యూస్ చానెళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.