: సీబీఐ కేసుల్లో విముక్తి కోసమే చండీయాగమా?... కేసీఆర్ పై గుత్తా విసుర్లు


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిసెంబర్ 23 నుంచి చండీయాగాన్ని తలపెట్టారు. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవలిలోని తన ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న ఈ యాగానికి హాజరుకావాలని ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ లతో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులకు ఆహ్వానం పలికారు. ఈ యాగంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ లోక్ సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ చండీయాగాన్ని ఎందుకోసం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆరోగ్యం మెరుగుపడేందుకే కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారా? లేక సీబీఐ కేసుల నుంచి విముక్తి కలగాలని యాగం చేస్తున్నారా? అంటూ ఆయన ప్రశ్నాస్త్రాలు సంధించారు. కేసీఆర్ చండీయాగంపై గుత్తా చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News