: తెలంగాణ మంత్రి చందూలాల్ కు మావోయిస్టుల బెదిరింపులు
తెలంగాణ గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ కు మావోయిస్టులు హెచ్చరికలు చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లను ప్రోత్సహిస్తున్న మంత్రికి శిక్ష తప్పదంటూ వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో మావోల పేరిట పోస్టర్లు విడుదల చేశారు. కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరుతో ఈ పోస్టర్లు ఉన్నాయి. వెంటనే ఈ పోస్టర్లపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో కేకేడబ్ల్యూకు చెందిన ఇద్దరు మావోలు మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేకేడబ్ల్యూ సభ్యులు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు.