: నేడు చంద్రబాబునాయుడు ఫుల్ బిజీ!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు పలు కార్యక్రమాల్లో బిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన ప్రజా ప్రతినిధులతో చర్చించనున్నారు. అమరావతి ప్రాంతంలో భూసేకరణ, ప్రత్యేక హోదా తదితర అంశాలపైనా వీరి మధ్య చర్చలు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆపై మధ్యాహ్నం 2 గంటలకు నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వాణిజ్య బృందంతో సీఎం సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని నెదర్లాండ్స్ ముందుకు వచ్చిన నేపథ్యంలో, ఈ సమావేశం జరుగనుంది. ఇక సాయంత్రం బీసీలు, మైనారిటీల సంక్షేమంపై చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష జరపనున్నారు. ఈ మధ్యలో తనను కలిసేందుకు వచ్చే ప్రజల నుంచి విజయవాడ క్యాంపు కార్యాలయంలో వినతిపత్రాలు తీసుకుంటారు. దీంతో ఈ రోజంతా బాబు ఫుల్ బిజీ!

  • Loading...

More Telugu News