: జింబాబ్వేలో వజ్రాల వ్యాపారం, చైనాలో హోటల్, థాయ్ లో నగల షాపులు... చోటా రాజన్ ఆస్తులెన్నో!
ఇటీవల ఇంటర్ పోల్ పోలీసులకు పట్టుబడిన మాఫియా డాన్ చోటా రాజన్ ఆస్తుల విలువ, ఆయనకు ఎక్కడెక్కడ ఏమేం ఆస్తులు ఉన్నాయన్న విషయమై అధికారులు లెక్కలు గడుతున్నారు. రాజన్ ఆస్తుల విలువ రూ. 5 వేల కోట్లకు పైగానే ఉండవచ్చని ప్రాథమిక అంచనా. రాజన్ ఇన్వెస్ట్ మెంట్లలో సుమారు 50 శాతం ముంబై నగర శివార్లలో ఉన్నట్టు తెలుస్తోంది. జింబాబ్వేలో వజ్రాల గనుల్లో వాటాతో పాటు థాయ్ లాండ్, సింగపూర్ దేశాల్లో రాజన్ పేరిట నగల దుకాణాలు కూడా ఉన్నాయట. చైనాతో పాటు జకార్తాలో స్టార్ హోటళ్లను కూడా రాజన్ కొనుగోలు చేశాడు. వీటితో పాటు పలు దేశాల్లో అపార్టుమెంట్లు, స్థలాలను ఆయన కొనుగోలు చేశాడని అధికారులు అంటున్నారు. కాగా, రాజన్ పై 75 కేసులు ఇండియాలో నమోదుకాగా, వీటిల్లో 25 వరకూ హత్య కేసులు ఉన్నాయి. దీంతో ఒకసారి రాజన్ మన పోలీసుల చేతికి దొరికితే, కనీసం మూడు సంవత్సరాల పాటు కస్టడీలో ఉంచుకోవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు.