: ఏపీపీఎస్సీ చైర్మన్ గా పిన్నమనేని... నేడు అధికారిక ఉత్తర్వులు


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ గా ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయ భాస్కర్ నియామకం దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం కాకినాడ జేఎన్టీయూలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ గా పనిచేస్తున్న ఉదయ భాస్కర్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు రూపొందించిన ఫైలుపై చంద్రబాబు నిన్న సంతకం చేసేశారు. వెనువెంటనే సదరు ఫైలు నిన్న సాయంత్రానికే రాజ్ భవన్ చేరిపోయింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు హైదరాబాదుకు చేరుకున్న తర్వాత ఉదయ భాస్కర్ నియామకానికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

  • Loading...

More Telugu News