: ఇక దూకుడు కొనసాగుతుంది: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ


వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ ర్యాంకు మెరుగైన అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. అయితే భారత్ ఈ దిశగా సాధించిన ప్రగతిని ప్రతిబింబించే విధంగా ర్యాంక్ మాత్రం వృద్ధి కాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ 1 నాటి కంటే ముందు ఉన్న పరిస్థితులనే ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకుందని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి జూన్ తర్వాత ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా పలు కీలక చర్యలు చేపట్టామని, ఆ చర్యలు ప్రస్తుత నివేదికలో చేరలేదని అన్నారు. వచ్చే ఏడాది నివేదిక రూపకల్పనకు ఈ చర్యలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, దీంతో భారత్ ర్యాంకు మరింత మెరుగవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణల వేగాన్ని మరింత పెంచుతామని, దూకుడు తగ్గించే ప్రసక్తే లేదని జైట్టీ పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News